Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణకంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో భవన నిర్మాణాలు చేసుకునే వారికి ఊరటనిస్తూ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి ఎఫ్ఎస్ఐ సడలింపు చేయడం ప్రశంశనీయమని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. ఈమేరకు గురువారం బోర్డు కార్యాలయంలో సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి సన్మానించారు. అనంతరం జంపన మాట్లాడుతూ సీఈఓ అజరు కుమార్ ఉన్న సమయంలో 0.5 నుంచి 1.5 ఎఫ్ఎస్ఐ పెంచారని, దీనిపై రక్షణ శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందచేశామని అన్నారు. ఓ భవన నిర్మాణ యజమాని హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోని పార్కింగ్, బాల్కనీ, మెట్లు, ఇతరత్రా వాటికి సడలింపు ఇచ్చారని అన్నారు.