Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ, లోప్రెషర్ నీటి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్దం చేయాలని జల మండలి అధికారులను అంబర్పేట ఎమ్మల్యే కాలేరు వెంకటేష్ ఆదేశించారు. గురువారం అంబర్పేట ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ గోల్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో జల మండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్ నుండి లింగంపల్లి వరకు తరచుగా డ్రయినేజీ సమస్య మంచి నీటి లోప్రెషర్ సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ, లోప్రెషర్ నీటి సమస్య నివారణకు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. తాత్కాలిక మరమతులతో సమస్యలు పరిష్కారం కావడం లేదని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రయినేజీ, మంచి నీటి పైప్లైన్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రతిపాదనలను సిద్ధం చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో జల మండలి ఆపరేషన్స్ డైరెక్టర్ కష్ణ, జీఎం సుబ్బారాయుడు, ఏఈలు కుషాల్, భావన తదితరులు పాల్గొన్నారు.