Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కార్మిక హక్కులను కాపాదెండుకు సీఐటీయూ ముందుంది అని సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కార్యదర్శి ఎస్. కిషన్, రాంకుమార్ అన్నారు. చాంద్రాయణగుట్టలోని జహంగీరబాద్ వద్ద జోన్ కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సంఘాలను ఐక్యంగా ఉద్యమాలు చేయడంలో, అన్ని కార్మికసంఘాలను ఒక్క తాటి పై తీసుకొనివచ్చి కేంద్రం ప్రభుత్వం పోరాటంలో కీలక పాత్ర సీఐటీయూ పోషిస్తుందని అన్నారు. కార్మిక హక్కులను కాపాదటనికి కార్మికులు అందరూ సీఐటీయూ సభ్యత్వం తీసుకోవాలని కార్మికులకు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జోన్ నాయకులు గౌస్, దిలీప్, భాషేర్ పాల్గొన్నారు.