Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధలో ట్రాఫిక్‌కు పరిష్కారమార్గం చూపండి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గురువారం వైట్ఒకే గదిలో పర్యటించిన ఆయన అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. గల్లీ చిన్నది కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న క్వార్టర్స్‌ను పూర్తిగా తొలగించడంతో స్థలం ఖాళీగా ఉందని, ఆ స్థలంలో కొంత భాగాన్ని రోడ్డు కోసం కేటాయిస్తే ట్రాఫిక్ సమస్య సమస్య పోతుందని పోలీసులకు అందిన లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు హోం మంత్రి మహమూద్ అలీ ని సైతం కలిసి విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు కాజా భారు, అంజాద్ ధర్మేందర్ రమేష్ పాల్గొన్నారు.