Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
టీడీపీని పటిష్టపరిచే చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం బౌద్ధనగర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 5 డివిజన్ల(సీతాఫలమండి, తార్నాక, మెట్టుగూడా, అడ్డగుట్ట, బౌద్ధనగర్) టీడీపీ అధ్యక్షులు జీవీ కష్ణ, గండికోట విజరు, తడక వినోద్, కాతా విజరు, గరిగె ప్రవీణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి డివిజన్ అధ్యక్షుడు వారి వారి డివిజన్లలోని ప్రజలతో మమేకమై వారి సమస్యలపై దష్టి సారించి పరిష్కారం కోసం కషిచేయాలని కోరారు. అవసరమైతే పెద్దఎత్తున ఆందోళనలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.