Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేయూ విద్యార్థి నాయకుడు డబ్బేటి మహేష్ కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురై బుధవారం ఎంజీఎం హాస్పిటల్లో మరణించిన విషయం తెల్సిందే. గురువారం సాయంత్రం ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహేష్ కు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల తో నివాళులు అర్పించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు, అదేవిధంగా కేయూ జేఏసీ ఏర్పాటు చేయడంలో దబ్బెటి మహేష్ క్రియాశీలకంగా పని చేసి అనేక మార్లు జైలు జీవితం గడిపి నలభైకి పైగా కేసులు కూడా ఉన్నాయని అన్నారు. తక్షణమే రాష్ట్రప్రభుత్వం మహేష్ మతిపై స్పందించి రూ 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, డీఎస్పీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.