Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి యంనంపేట్ బ్రిడ్జ్ వరకు గతంలో మాస్టర్ ప్లాన్లో పొందు పర్చిన 200 ఫీట్ల రోడ్డు వల్ల గహ నిర్మాణ అనుమతులు రాక మాస్టర్ ప్లాను అమలు పర్చక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా మాస్టర్ ప్లాన్లో సవరణలు చేసి 100 ఫీట్ల రోడ్డుగా చేయమని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మెన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి వెంటనే స్పందించిమున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు క్యాసరం అశోక్, టీఆర్ఎస్ అధ్యక్షులు తెళ్ళ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు గూడూరు ఆంజనేయులు గౌడ్, మోకు జగన్ మోహన్ రెడ్డి, కోమిరెల్లి సుధాకర్ రెడ్డి, అన్నంరాజు శ్రీనివాస్, అన్నంరాజు సురేష్ ,నిమ్మల శ్రీనివాస్, అరిగే రాములు, వరకాల పెంటయ్య, నరేందర్ రెడ్డి, నర్సింహా, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.