Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
నవతెలంగాణ-ఓయూ
ఆర్యూబీ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్లో పర్యటించి తుకారాం గేట్ వద్ద చేపడుతున్న ఆర్యూబీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా ఇక్కడి రైల్వే గేట్ వల్ల ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బల్దియా, రైల్వే అధికారులు సమన్వయంతో ఆర్యూబీ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. వంతెన నిర్మాణం వల్ల ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజిగిరి, కంటోన్మెంట్ తదితర నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కిశోర్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.