Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తికై నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజరు నిర్వహించిన దీక్ష కు సంఘీభావంగా కార్పొరేటర్ పావని వినరు కుమార్ హాజరై రాష్ట్రర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర మాజీ అధ్యక్షుడు, బీజేపీ నగర యువ నాయకులు ఎ.వినరు కుమార్, నాయకులు నవీన్, సాయికుమార్ బాలకష్ణణ ఆనంద్ రావు, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు