Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
అసంఘటిత కార్మికులు ఈ- శ్రమ్ పోర్టర్లో పేర్లు నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సునంద అన్నారు. అడిక్మెట్ డివిజన్లోని పాపడ్ గల్లీలో ఈ-శ్రమ్ క్యాంప్ ఏర్పాటు చేసి కార్మికులకు నమోదు చేసుకునేందుకు వెసలుబాటు కల్పించారు. అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ కార్డ్ కోసం గుర్తింపు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తో నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్డ్ పొందిన వారికి ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే రెండు లక్షల బీమా, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే ఒక లక్ష బీమా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అర్హులుగా ఉంటారని కార్మికుల తెలియజేశారు.