Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఇటీవల ఫెయిల్ అయిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ మినిమం మార్కులతో పాస్ చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రకటించడం పట్ల ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగాను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు కతజ్ఞతలు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన ఒక లక్ష 30 వేల మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందిని గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ద్వారా సిఎం కేసీఆర్‌కు తెలియజేశామని గుర్తు చేశారు. చదువును నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతోనే తక్కువ మార్కులు వచ్చిన వారిని పాస్ చేయలేదని, విద్యార్థులంటే వ్యతిరేకత ప్రభుత్వానికి లేదని, విద్యార్థుల భవిష్యత్, బాధ్యత వారిపైనే ఉందని మంత్రి చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్వాయి శ్రీనివాస్, మగలూరి విజయశ్రీ, తాడిశెట్టి ప్రతిమ, గొల్లపల్లి జయశ్రీ, జి.రమేష్, బిరాదర్ బస్వరాజ్ పాల్గొన్నారు.