Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మూసాపేట సర్కిల్ ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శోభన కాలనీ అరబ్షా దర్గా సమీపప్రాంతంలో నాలాపై ఉన్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం కమిటీ వారితో కలిసి స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి దర్గాకు, మసీద్ కి వచ్చే భక్తులు వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మజీద్ కమిటీ సభ్యులు తన దష్టికి తీసుకొచ్చారని వెంటనే ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు దష్టికి తీసుకు వచ్చామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించి రూ. 40 లక్షల నిధులు కేటాయించారని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు దర్గా, మస్జిద్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మాధవరం, కార్పొరేటర్ సతీష్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫతే నగర్ మైనారిటీ ప్రెసిడెంట్ సలాహుద్దిన్, అబ్దుల్ వహీద్, జంగిర్ హుస్సేన్, అమీర్, ఆదర్శ్ , మొహమ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.