Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
నాణ్యతలో రాజీ పడకుండా ప్యాచ్‌వర్క్ పనులను పూర్తి చేయాలని ఆర్కే పురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ అన్నారు. సోమవారం డివిజన్లో వాస్తుకాలనీలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కాలనీలో మిగతా రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని అధికారులకు సూచించారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా తన దష్టికి తీసుకువస్తే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దష్టికి తీసుకువెళ్లి పనులను పూర్తి చేసేందుకు కషి చేస్తానన్నారు. సాజీద్, ఇబ్రహీం కాలనీవాసులు నిరంజన్, ఎల్లారెడ్డి, రమణారెడ్డి, నవీన్, జీహెచ్ఎంసీ సైట్ ఇంజినీర్ మాధవి పాల్గొన్నారు.