Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మాదిగలకు పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవిడిమాండ్ చేశారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంద కష్ణ పోరాటం వల్ల మాదిగలకు ఒరిగిందేమీ లేదని, ఆయన ఎన్నికల ప్యాకేజీ కోసమే ఉద్యమం నడుపుతున్నాడు అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్,ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణ అంశాన్ని ఎందుకు చర్చకు తీసుకు రావడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు. బీజేపీ మాదిగలను మోసం చేస్తుందని తెలుసుకొని ఇకనైనా వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన 12 శాతం రిజర్వేషన్లను అమలు చేసే వరకు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని, రాబోయే రోజుల్లో తాము నిర్వహించే కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. వర్గీకరణ చేయని పక్షంలో మద్దతు ఇచ్చిన రెండు జాతీయ పార్టీలను రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కచ్చితంగా బొంద పెడతామని హెచ్చరించారు. యునైటెడ్ ఫ్రంట్లో ఇటుక రాజు, కొక్కెర భూమన్న, రయికంటి రామ్ దాస్, గ్యార వెంకటేష్, గజ్జల మల్లికార్జున్, పరమేశ్వర్ మాదిగ,మైసా ఉపేందర్, గడ్డ యాదయ్య, సుందర్ పాల్గొన్నారు.