Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ
చైర్మెన్ గజ్జల కాంతం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన బీజేపీ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జల కాంతం డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై యావత్ దేశాన్ని కలుస్తామని హెచ్చరించారు. బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం దేశంలో పేద మధ్య తరగతి ప్రజలు జీవించలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. దేశంలో ఎప్పుడూ లేనివిధంగా మోడీ పరిపాలనలో నిరుద్యోగం పెరిగిపోతోందని విమర్శించారు. అద్భుత ప్రగతి కనబరుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు సైతం కార్పొరేట్ సంస్థలకు విక్రయించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. మొత్తంగా దేశంలోని అత్యధిక ప్రజలకు లబ్ధి చేకూర్చే రిజర్వేషన్లను కాలరాసే అందుకే ప్రభుత్వ సంస్థలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించని బీజేపీకి నిరుద్యోగులపై మాట్లాడే అర్హత ఎక్కడిదంటూ నిలదీశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపడతామని తెలిపారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.