Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన భాషా తీరు మార్చుకోవాలని, రాజకీయ పార్టీలో చేరిన అనంతరం జర్నలిస్టు ముసుగు తొలగించుకోవాలని టీఆర్ఎస్ పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ పేరుతో చానెల్ ఏర్పాటు చేసి తన ఇష్టారాజ్యంగా మాట్లాడే మల్లన్న కొద్ది సేపు రాజకీయ నాయకుడిగా, మరికొంత సేపు జర్నలిస్టు ముసుగులో బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే వ్యక్తి అని విమర్శించారు. ఇప్పటికైనా తన భాషా మార్చుకోకపోతే ప్రజల క్షేత్రంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు.