Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ జాన్పాల్ రెడ్డి అన్నారు. సోమవారం కార్పోరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా, లెనిన్ నగర్ ప్రాంతాల్లోని షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించామని గుర్తు చేశారు. అయినప్పటికీ కొన్ని షాపుల యజమానులు ప్లాస్టిక్ సంచులు, కవర్లు వాడుతున్నారని తెలిపారు. అందుకే తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న కొందరు షాపుల యజమానులకు రూ 500 నుంచి 2వేల వరకు జరిమానా విధించామని, మళ్లీ అలానే ప్లాస్టిక్ కవర్లు వాడితే షాపులు సీజ్ చేసి ట్రెడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇన్చార్జి రాము, శానిటేషన్ సూపర్వైజర్లు రంజిత్ కుమార్, జీవన్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.