Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కేపీహెచ్బీలో హోజింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు చిన్నారులు గుంతలో పడి చనిపోయారని, వారి కుటుంబాలకు రూ. రూ.లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగల్ రావు అన్నారు. సోమవారం బాధితులను పరామర్శించి ఒక్కో కుటుంబానికీ రూ. 20 వేల చొప్పున రూ. 60 వేల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గతంలో మందాడి శ్రీనివాస్ రావు ఇదే డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు ఇద్దరు ఇదే గుంతలో పడి చనిపోయారని గుర్తుచేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కండ్లు తెరిచి ఆ గుంతని ముసివేయించాలని, అలాగే ఆ కుటుంబాలకు ప్రతి కుటుంబానికీ రూ.15 లక్షలు నష్ట పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పార్లమెంట్ వరకు తీసుకోపోవడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ వారి వెంట ఉంటుందని తెలిపారు. కార్యక్రంలో బి బ్లాక్ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేంద్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ మొయిజ్, కేపీహెచ్‌బీ డివిజన్ నాయకులు అరవింద్ రెడ్డి, మేకల రమేష్, ఉదరు రావు, ప్రవీణ్, సంధ్య, రజిత, రంగా స్వామి, సతీష్, గణేష్ పాల్గొన్నారు.