Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ బుక్ ఫెయిర్లో సమాంతర సినిమా సదస్సు
నవతెలంగాణ-అడిక్మెట్
హక్కుల కోసం పోరాడే చోటా మంచి చిత్రాలు వస్తాయని సమాంతర సినీ సదస్సులో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ స్టేడియం 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్లో చిందు ఎల్లమ్మ వేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సిటీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సమాంతర సినిమా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సుప్రసిద్ధ సినీ దర్శకులు బీ . నర్సింగరావు, సినీ దర్శకులు ఎన్.శంకర్, భాషా సంస్కతి శాఖ సంచాలకులు మామిడిి హరికష్ణ, సినీ నటులు తనికెళ్ల భరణి, ప్రభుత్వ సిటీకెళాశాల ప్రిన్సిపాల్ బాల భాస్కర్, సుప్రసిద్ధ కవి సతీష్ చందర్, ప్రముఖ సినీ విమర్శకులు రమేష్ బాబు హాజరయ్యారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ భారత దేశంలో సమాంతర సినిమా మల్లి, పెద్దమనుషులు లాంటి చిత్రాలతో ప్రారంభమయ్యాయని అన్నారు. శామ్ బెనిగళ్, అంకుర్ నిశాంత్ లాంటి చిత్రాలు 1974 ప్రాంతంలో పార్లల్ సినిమాలకు ప్రతీకలుగా నిలిచాయి. కన్నడంలో పట్టాభీ , కేరళలో ఆదూరి గోపాల కష్ణన్, అరవిందన్ . బెంగాల్లో మణాల్ సేన్, సత్సజిత్ రారు, తెలుగునాట బి .నరసింగరావు రంగులు కల, మా భూమి, దాసి లాంటి చిత్రాలు తీశారు. హక్కుల కోసం పోరాడే చోట మంచి చిత్రాలు వస్తాయి అని తెలిపారు. శ్రీధర్, ప్రేమ రాజు, శంకర్ లాంటి వారు మంచి సినిమాలు తీశారు అని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ వినోదం కోసం సినిమా కాక జీవితాన్ని డాక్యూమెంట్ చేసేదే సమాంతర సినిమా. సత్సజిత్ రారు సినిమాలు తనకు మొదటిలో నచ్చేవి కావు, కష్ణ శాస్త్రి తన నాటకం చూసి జీవితాన్ని చూపించింది అని అనటంతో అబ్బాస్, బలరాసాహిణి లాంటి వారి ప్రేరణతో తాను మిథునం తీశానన్నారు. కులాంతర సినిమా మ్యూజియంలో పెట్టాలి. ఓటీటీ వాళ్ల ఎలాంటి సినిమా అయినా తీసుకునేందుకు అవకాశం కలిగిందని అన్నారు. సతీష్ చంద్ర మాట్లాడుతూ.. సమాంతర కళారూపానికి చిందు ఎల్లమ్మ నిలువెత్తు నిదర్శనమని ఆమె స్త్రీ, పురుష వేషాలు వేసి మెప్పించేదని, సమాంతర సినిమాలు సమాజంలో మార్పు తీసుకొస్తాయని అన్నారు.