Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఏండ్లుగా తెలుగు గ్రామీణ ప్రజలలో తిరుపతి వెంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు' తో సమంగా చిలకమర్ధి లక్ష్మీ నరసింహం 'గయోపాఖ్యానం' నాటకం అంతటి ఆదరణ పొందింది. శంకర మఠ్ ప్రాంగణంలో చౌడేస్వర నాట్య కళా మండలి నిర్వహణలో కుందుర్తి వెంకట కష్ణ సమర్పణలో గయోపాఖ్యానం రసవత్తరంగా ప్రదర్శించారు. కషునిగా వెంకట కష్ణ అర్జునినిగా నారాయణ్ స్వామి శ్రావ్యమైన గళలతో పద్యాలను అలపించి శ్రోతలను పరవశుల చేశారు. చావలి విఠల్,మంగ పతిరావు జీ. నాగేశ్వర రావు, మల్లాది రమణ ఇతర పాత్రలను పోషించి నాటకాన్ని రక్తికట్టించారు. అతిథులుగా సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, వేద పండితులు శంకర శర్మ తదితరులు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకుడు మల్లాది రమణ మాట్లాడుతూ రెండ్రోజుల నాటకాలను రంగస్థల ప్రముఖులు అయ్యదేవర పురుషోత్తమ రావు కు,పీ.రాధా కష్ణ మూర్తి స్మారకం గా ప్రదేర్శించామని సౌజన్యం అందించిన తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ కు ధన్యవాదాలు తెలిపారు