Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాంస్కతిక పర్యాటక శాఖ
మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్
కళాకారులు, సాహితీకారులు ప్రాంత కుల మతాలకు అతీతులని సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై సోమవారం గుమ్మడి గోపాలకష్ణ ఫౌండేషన్, సత్య సాయి కళా నికేతన్ నిర్వహణలో పద్మభూషణ్ ఏ. ఆర్.కష్ణ స్మారక నాటకోత్సవాలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతో ప్రాచీన కళలు నేటి సినిమాలు టీవీల తాకిడిలో మరుగుపడిపోతున్నాయని, సమాజంలో మంచిని పెంచే నాటక ఇతర కళా ప్రక్రియలు కాపాడుకోవలని అన్నారు. తెలంగాణలో కళాకారుడు పస్తులు ఉండే పరిస్థితి లేదని వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అధ్యక్షత వహించిన సంస్థ అద్యషులు డాక్టర్ కేవీరమణ మాట్లాడుతూ నాటకమె జీవనంగా ఏఆర్.కష్ణ జీవించి ఎందరినో ఉత్తమ కళాకారులను తెలుగు వారికి ఆ దించరని తెలిపారు. అయన జయంతి సందర్భంగా నాటకోత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కష్ణ స్మారక పురస్కారాన్ని రంగస్థల ప్రయోక్త డి. ఎస్.ఎన్. మూర్తికి బహుకరించి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభా పతి మండలి బుద్దప్రసాద్, శాసన సభ్యుడు అంజయ్య యాదవ్ సత్కరించారు. కొండ లక్ద్మీకాంత రెడ్డి తదితరులు పాల్గొన్న సభకు గుమ్మడి గోపాలకష్ణ స్వాగతం పలికారు. అనంతరం నిస్సుభిత బ్యాలెట్ థియేటర్ గ్రూప్ వారిచే పుల్లాచారి రచించిన 'ఆట' నాటిక డాక్టర్ రామ మోహన్ దర్శకత్వంలో ప్రదర్శించారు.