Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అధికారులు సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగ్ అంబర్‌పేట డివిజన్లోని రెడ్ బిల్డింగ్ వద్దనున్న మోయిన్ చెరువు హిందూ శ్మశాన వాటిక యార్డ్, గోల్నాక డివిజన్లోని కమేలా హర్రాస్ పెంట హిందూ శ్మశాన వాటికల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. పార్కింగ్, ఎలక్ట్రిక్ బర్నర్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని లోప్రెషర్ నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పైప్‌లైన్ నిర్మాణ పనుల కోసం పలు చోట్ల తవ్వకాలు చేపట్టిన ఆయా ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణ పనులు ఆగిపోయాయని, పైప్‌లైన్ పనులు పూర్తయిన వెంటనే జిహెచ్ఎంసి వారికి సమాచారం అందించి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించిన వెంటనే అంచనా వ్యయాన్ని సిద్ధం చేసి ఆలస్యం లేకుండా బిల్లులను పంపించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకొని పనులను పూర్తి చేసి స్థానికులకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నియోజకవర్గం పరిధిలోని జంక్షన్లు, పార్క్‌లు, ఆట స్థలాలను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. ఎక్కడైనా అనుమతులు లేదా ఇంక ఏమైనా ఉంటే వెంటనే తన దష్టికి తీసుకురావాలని సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించేందుకు కషి చేస్తానని తెలియజేశారు. అంబర్‌పేట నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో అభివద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సువర్ణ, ఏఈలు ఫరీద్, ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, నరేందర్, దుర్గా, సంపత్, వాటర్ వర్క్స్ ఏఈలు రోహిత్, మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకష్ణ, కాంట్రాక్టర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.