Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాగతి అభ్యుదయ సంఘం వ్యవస్టాపకులు భావన శ్రీనివాస్
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రకతి పరిరక్షణ అందరి బాధ్యత అని జాగతి అభ్యుదయ సంఘం వ్యవస్టాపకులు, ఎల్బీనగర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటి చైర్మెన్ భావన శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బడంగ్పేట్ పరిధిర మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుర్రంగూడలో జాగతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రకతి పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను ఎవరూ వాడకూడదని, వాటి స్థానంలో బట్ట సంచులను ఉపయోగించాలని సూచించారు. మొక్కల పెంపకం వాటి పరిరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకొని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూయోగ, ధ్యానం చేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. విద్యార్థుల అందరి చేత ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా బట్ట. సంచులను ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం విద్యార్థులందరికి డిక్షనరీలు పంపిణీ చేశారు. సభ్యులు నవీన్, రాము పాల్గొన్నారు.