Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ మోర్చా కల్చరల్ కో కన్వీనర్‌గా జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన కంచారి హనుమంతచారి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.కె.శేఖర్‌యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మంగేష్‌కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఆయనతో పాటు అదే ప్రాంతానికి చెందిన పడాల సత్యనారాయణను జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కంకణబద్దులై పని చేయాలని, 2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరే విధంగా అందరం కృషి చేయాలని వారికి సూచించారు. నూతనంగా నియమితులైన కంచారి హనుమంతుచారి, పడాల సత్యనారాయణలు మాట్లాడుతూ రెండు దశాబ్దాల కాలంగా పార్టీలో అంకిత బావంతో పని చేసినందుకు తమ సేవలను గుర్తించి ఈ పదవి అందజేశారు. వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీ శ్రేయస్సు కోసం అంకిత భావంతో పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కె.సిద్దారెడ్డి, కె.నరేందర్‌రెడ్డి, సత్యనారాయణ యాదవ్, అరుణ్‌కుమార్, పత్తి రఘుపతి, మహిళా నాయకురాలు అరకాల సుధా తదితరులు నాల్గొన్నారు. అనంతరం నూతనంగా నియమితులైన వారిని పుష్పగుచ్చాలతో అభినందించారు.