Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కరోనా తీవ్రత కొంత తగ్గిన తర్వాత తెలంగాణ జిల్లాల్లోని గ్రామాల కళాకారులు రాష్ట్ర రాజధానిలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా మంగళ వారం శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన మందిరంలో కల్వకురి (నాగర్ కర్నూల్ జిల్లా)చెందిన స్వర్ణ భారతి కళా నిలయం సంస్థ నిర్వహణ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కళా ప్రదర్శనలతో ప్రాంగణాన్ని రస ప్లావితం చేశారు. మణికొండ కు చెందిన టెంపుల్ ఆఫ్ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ శ్రీనయ్య మాస్టర్ శిష్య బందం నత్యాలతో వేదిక ఘల్లు మంది. బండ్ల గూడ మనిమాన్ కూచిపూడి డాన్స్ అకాడమీ, రాకేష్ మాస్టర్ శిష్య బందం, సంప్రదాయ నత్య అంశాలు నర్తించారు గండిపేట ఒగ్గు ప్రవీణ్ బందం డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. కల్వకుర్తికి చెందిన దీ విసడోమ్ స్కూల్ బాల బాలికలు బంద గానంతో ఆకట్టుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో అతిథులుగా పీజీఆర్ చైర్మెన్ కె.లక్ష్మారెడ్డి, ప్రెసిడెంట్ లీల లక్ష్మారెడ్డి డబ్బింగ్ కళాకారుడు ఆర్.సి.ఎమ్ రాజు తదితరులు పాల్గొని వివిధ రంగ ప్రముఖులను సత్కరించారు. ంగస్థల కళాకారులు నరహరి రాజు, బీ. కష్ణయ్య, రాం మూర్తి, చూడమని, నారోజు మోహన్ పాల్గొన్నారు.