Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచంలోనే అరుదైన మిమిక్రీ కళా ప్రక్రియలో నేరెళ్ల వేణుమాధవ్ ఆగ్రగణ్యుడ, ఆయన జయంతి అంతర్జాతీయ స్థాయిలో మిమిక్రి దినోత్సవంగా గుర్తింపు పొందాలని ప్రభుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణ ఆకాంక్ష వ్యక్తం చేశారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై మంగళవారం ఆనంద లహరి సాంస్కతిక సంస్థ, హైద్రాబాద్ మాజిషన్స్ సంయుక్తంగా విఖ్యాత మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 90వ జయంతి వేడుక మిమిక్రీ మేజిక్ కళాకారుల సందడితో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రమణ పాల్గొని సినీ డబ్బింగ్ కళాకారుడు సి.ఎమ్ రాజును నేరెళ్ల విశిష్ట పురస్కారంతో సత్కరించి మాట్లాడారు. నిరాడంబరత, స్వచ్ఛత, ప్రతిభ, నిగర్వం వేణుమాధవ్ స్వరూపం అని కొనియాడారు. మిమిక్రీ కళాకారుడుగా ఎదిగి సినీ రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దూసుకు పోతున్న రాజు మిమిక్రీ కళాకారులు అందరికి స్ఫూర్తి అని అభినందించారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి, బాల సాహితీవేత్త చొక్కాపు రమణ, నటుడు జెన్నీ, కళాకారులు జీవీఎస్.రాజు, భవిరి రవి, నిట్టల శ్రీరామ మూర్తి, గురు స్వామి, మల్లం రమేష్, వసంత్, భవిరి శివ పాల్గొన్నారు.