Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలందరికి ఉచిత విద్య,వైద్యం కమ్యూనిస్టుల రాజ్యంతోనే సాధ్యమని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు. మంగళవారం సీపీఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని షాపూర్‌నగర్ హమాలి యూనియన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతమే సంపద అందరికి సమానంగా పంపిణీ జరగాలని, అన్ని వనరులు ప్రభుత్వ ఆధీనంలో ఉండి అందరికి ఉపాధి అవకాశాలు కల్పించి కార్మిక, రైతు ప్రభుత్వం ఏర్పాటు చేయడమన్నారు. ప్రపంచంలో దేశంలో ఇలాంటి సిద్దాంతం ఉన్న పార్టీ ఏది లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు దేశంలో హిందూ రాజ్యం తీసుకవస్తామని ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మడం బీజేపీ విధానమని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను వ్యాపారస్తులకు అమ్మి ప్రజలను, ప్రభుత్వానికి పెట్టుబడి దారులకు బానిసలుగా చేయడమేలక్ష్యంగా బీజేపీ పని చేస్తుందన్నారు. బీజేపీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసి బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దేశాన్ని కాపాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, సీపీఐ శాఖ కార్యదర్శి జార్జ్, సుంకిరెడ్డి, యువజన సంఘం నాయకులు నర్సింహారెడ్డి, కనకయ్య, మల్లేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.