Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరెకటికలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆరెకటిక అభివద్ధి సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ కష్ణయ్య మాట్లాడుత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివద్ధిలో నెంబర్ వన్ అని చెబుతున్న ముఖ్యమంత్రి ఆరెకటికలను అన్ని విధాల ఆదుకోవాలి అన్నారు. ఆరెకటికలకు సంబంధించిన మేకల మండిల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమిలో 5 కోట్లతో ప్రభుత్వమే భవనాన్ని నిర్మించి ఇవ్వాలని, రూ. 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషను ఏర్పాటు, ఆరెకటికలకు బీసీ డీ నుంచి బీసీ ఏ హోదా కల్పిస్తూ జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అరెకటిక అభివద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు నాగశేషు, ప్రధాన కార్యదర్శి రామదాసు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.