Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మేయర్ కొలను నీలగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పలు అంశాలను ప్రవేశపెట్టారు. టాక్స్ వసూలు కోసం యంత్రాల కొనుగోలు, డంపింగ్ యార్డ్ కంపోస్టింగ్ బెడ్, పారిశుధ్య విభాగం పనులు, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కార్యక్రమాలు, గ్రేడ్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, హరితహారంలో భాగంగా 63 లక్షల మొక్కలను పెంపకం, 33 డివిజన్లలో అభివద్ధి పనులకు నిధులు కేటాయించడం తదితర అంశాలపై కార్పొరేటర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.