Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే
కూన శ్రీశైలంగౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. మంగళవారం సుభాష్‌నగర్ డివిజన్ సుభాష్‌నగర్‌లో నరేందర్‌గౌడ్, లోచారం రమణ ఆధ్వర్యంలో ఈ-శ్రమ్ కార్డుల నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ శ్రమ్‌లో నమోదు చేసుకున్న లభ్దిదారులకు ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శ్రమ్ కార్డు ద్వారా బీమా సౌకర్యం లభించడమే కాకుండా ఈ కార్డు ద్వారా భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మరెన్నో పథకాలు పోందే అవకాశం ఉందన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి గరిగే శేఖర్, బిజ్జిలి సాంబయ్య, గుబ్బల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మురళీ, హనుమాన్ కచావా, లోచారం కవిత, నరేందర్‌రెడ్డి, బిజ్జిలి గోపి, సురేష్‌గౌడ్, తిరుపతిరెడ్డి, ఏడు కొండలు, శ్రీనివాస్, వెంకట్, బిజ్జిలి శ్రీకాంత్, శ్రీనివాస్, సంతోష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.