Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్, హైమద్‌నగర్ ప్రాంతాలలో రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు, నూతన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. మంగళవారం డివిజన్లోని ప్రేమ్‌నగర్, హైమద్ నగర్ ప్రాంతాలలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్ధానికులు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు, నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు గుంతలు ఏర్పడ్డ రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జాకీబాబు, మహేష్ ముదిరాజ్, తిరుపతి, వంజారి నాగరాజు, బాబా, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.