Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మొయిన్ చెరువు వరద నీటి కాలువ నిర్మాణానికి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అంబర్‌పేట శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ కోరారు. మంగళవారం బాగ్ అంబర్‌పేట డివిజన్లోని మోయిన్ చెరువు నుండి మల్లిఖార్జుననగర్, బాపునగర్, పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ మీదుగా ఎస్టీపీ వాటర్ వర్క్స్ గేట్ వరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెయిన్ చెరువు నుంచి వచ్చే వరద నీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను కోరారు. లోతట్టు ప్రాంతాలోకి వరద నీరు రాకుండా ఎస్టీపీ వాటర్ వర్క్స్ గేట్ వద్ద గల మూసీలో కలిసే విధంగా కాలువ నిర్మాణం చేపట్టాలని అన్నారు. పటేల్ నగర్ నుండి ప్రేమ్‌నగర్ వరకు డ్రయినేజీ, డ్రెయిన్ వాటర్ కలిపి కాలువలో కలపడం వలన తరచుగా ఓవర్ ఫ్లో సమస్యలు వస్తున్నాయని, డ్రయినేజీ కోసం విడిగా మరొక పైప్‌లైన్ నిర్మాణాన్ని అంచెలంచెలుగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వరద నీటి సమస్యతో లోతట్టు ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా గతంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు సమస్యను విస్మరించారని చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విజరు కుమార్‌గౌడ్, వాటర్ వర్క్స్ డీఓపీ కష్ణ, జిఎం సుబ్బారాయుడు, ఏఈలు కుషాల్, మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్లు బాలకష్ణ, లక్ష్మణ్, డిఈలు సుధాకర్, సువర్ణ, ఏఈలు శ్వేత, ప్రేరణ, ఫరీద్ వర్క్ ఇన్స్పెక్టర్లు సంపత్, రవి, దుర్గాతో పాటు టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ ముదిరాజ్, దిలీప్, సలీం, మహేష్, సలీం, జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, తిరుపతి, రఫీక్, నాగరాజు, విష్ణు, మహేష్ గంగపుత్ర, లవంగు నాగరాజు, హైమద్, సంతోష్ చారి పాల్గొన్నారు.