Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వంగూరి రాములు
నవతెలంగాణ-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల(బీసీడబ్ల్యూ) మౌలిక సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగూరి రాములు, సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం 13 మందితో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వంగూరి రాములు, ఐలాపురం రాజశేఖర్, వెంకట నర్సయ్య మాట్లాడుతూ ప్రతి లేబర్ బోర్డ్ అడ్డాలో వానకు, ఎండకు, చలికి రక్షణగా భవనాలు, మల, మూత్ర విసర్జన కోసం మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు, సీనియర్ కార్మికులకు నెలకు రూ. 6వేలు చొప్పున ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఈఎస్ఐ, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ప్రతి కార్మికుడు లేబర్ కార్డు, ఈ-శ్రమ్ కార్డులను పొందాలని, వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా సీఐటీయు అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం13 మందితో కూడిన నూతన కమిటీని ప్రకటించారు. ఓల్డ్ బోయినపల్లి భవన నిర్మాణ అడ్డా అధ్యక్ష, కార్యదర్శులుగా ముడావత్ రమేష్, ఎం. సుబ్బారావు, ఉపాధ్యక్షులు నాగభూషన్, వి. రవి నాయక్, సహాయ కార్యదర్శిగా నెహ్రూ, ఆంజనేయులు ఎన్నికయ్యారు.