Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నిజాం కళాశాలలోని నూతన భవనాన్ని డిగ్రీ స్టూడెంట్లకే కేటాయించాలని ఏఐఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ, టీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మహిళా విద్యార్థినిలు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు చదువుకోవడానికి వస్తున్నారని చెప్పారు. అలాంటి నిజాం కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతూ చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి నాడు ఉన్న తరుణంలో వివిధ పోరాటాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో 2017న మహిళ విద్యార్థులకు వసతి గహం మంజూరు చేయించామని గుర్తుచేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న వసతిగహం డిగ్రీ విద్యార్థులకు కాకుండా పీజీ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు కేటాయించాలని యూనివర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారని, అలాంటి ఆలోచన విరమింపజేసుకోవాలి కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి హరికష్ణ, ఎంఎస్ఎఫ్ సికింద్రాబాద్ ఇన్చార్జ్ నకిరేకంటి నాగరాజు మాదిగ, టీఎస్‌యూ ఓయు అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్, టీఆర్ఎస్వీ నాయకులు సుదీప్ విద్యార్థులు స్వప్న, స్వాతి, జరీనా, సంగీత తదితరులు పాల్గొన్నారు.