Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
తాట,ి ఈత చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ మండలం లోని చిన్న సూరారం గ్రామంలో తాటి ఈత చెట్లు నరికిన ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. చిన్న సూరారం గ్రామంలో సర్వేనెంబర్ 70 భూమిలో గల తాటిచెట్లు 200, ఈత చెట్లు 100 పైగా ధ్వంసం చేసినారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ధ్వంసం చేసిన వారిలో సుంకరి సోమయ్య. తండ్రి లింగయ్య, సుంకరి అంజయ్య, తండ్రి లింగయ్య వీరిపై చర్య తీసుకోవాలని అన్నారు. కల్లుగీత కార్మికులు 20 మంది పైగా వచ్చి, తాటి ఈత చెట్లను నరక వద్దని, ఎంత బతిమిలాడినా వినకుండా వారి ఇష్టానుసారంగా, జేసీబీతో చెట్లను తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉప్పల గోపాల్, అధ్యక్షుడు వెంకన్న, సైదులు ,లింగయ్య ,అంజయ్య, చంద్రయ్య ,రామయ్య ,వెంకన్న పాల్గొన్నారు.