Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఫైళ్ల గణపతి రెడ్డి
నవతెలంగాణ -వలిగొండ
పంచాయతీలలో పనిచేసే కార్మికులందరికీ ఎన్ని గంటల పని దినాలు అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫైళ్ల గణపతి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం స్థానిక ఆ సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉదయం 5:00 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రోజుకు 12 గంటలు పని చేసినట్టు తెలిపారు కార్మికులకు ఈ శ్రమ ఇన్సూరెన్స్ వెంటనే చేయించాలన్నారు 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా 2021 ప్రాతిపదికన ఈఎస్ఐ పీఎఫ్ పదకొండవ పిఆర్సి అమలు చేయాలన్నారు జిఓ 61 ప్రకారం 15600 వేతనం ఇవ్వాలి అన్నారు కారోబార్ బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం ఈశ్వర్ ఎడవల్లి ఎల్లయ్య సంగం మండల అధ్యక్షుడు గంగాపురం సురేందర్ ధనమ్మ ఎల్లయ్య స్వామి నరసింహ తదితరులు ఉన్నారు.