Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయ వర్తక సంఘం చేపట్టిన దీక్షలు గురువారంతో రెండో రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు వర్తకులు మాట్లాడుతూ ఆలయ అభివద్ధికి సహకరించిన కొండపై వరదలకు సీఎం ఇచ్చిన హామీ మేరకు పైనే షాపులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు బీజేపీ మండల నాయకులు రచ్చ శ్రీనివాస్, లెంకలపల్లి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బెలీదే అశోక్, రంగ సత్యం మద్దతు తెలిపారు. ఈ దీక్షలో వ్యాపారులు వర్తక సంఘం అధ్యక్షులు కర్రె వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి తడక వెంకటేష్, మాజీ అధ్యక్షులు కొన్నే రమేష్, వర్తకులు చుక్కల సత్యం, నర్సింగరావు, ప్రసాద్, మార్గం యాదగిరి, భాను, గడ్డమీది రాజు, సిల్వేరు కిషోర్, బెజగం శివ కుమార్ , కల్వకుంట్ల శేఖర్, పూల ఉపేందర్ రెడ్డి, కాయితి వెంకట్ రెడ్డి, ఆర్ కష్ణ, కర్రే సిద్ధప్ప, చంద్రగిరి శ్రీనివాస్, దామోదర్, మనీ దీక్షలో పాల్గొన్నారు.