Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యుత్ మరమ్మతుల కారణంగా 33/11 కేవీ జగద్గిరిగుట్ట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మగ్దూంనగర్, రింగ్‌బస్తీ, పోలాల బస్తీ, శ్రీనివాస్‌నగర్, లెనిన్‌నగర్, సీసాలబస్తీ, జగద్గిరిగుట్ట చివరి బస్టాప్, అంజయ్యనగర్, మైసమ్మనగర్, భూదేవిహిల్స్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. వినియోగదారులు గమనించి తమ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.