Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
హుస్సేన్ సాగర్ నాలా పరివాహక బస్తీలైన సబర్మతి నగర్, అరుంధతి నగర్, దోభిఘాట్ ప్రజల భయాందోళనకు కొంత శాతం ఊరట లభించిందని, కానీ అధికారులు నాలా విస్తరణ కొలతలు నిర్వహించి పూర్తి స్పష్టత ఇచ్చిన తరువాతే నిజమైన సంబరాలు జరుపుకుంటారని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినరు కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయా బస్తీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రోత్సాహంతో కార్పొరేటర్‌గా పలుమార్లు జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చానని గుర్తుచేశారు. అందువల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గి పేదల ఇండ్లు తొలగించకుండా నాలా విస్తరింజేసి, ప్రహరీ గోడ నిర్మిస్తామని ప్రకటించారని అని తెలిపారు. పర్యటనలో బీజేపీ నగర యువ నాయకులు ఎ.వినరు కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్,ఎం.ఉమేష్, తులసి, సంధ్య రాణి, సాయి కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, సంతోష్, సూరి, సంపత్ యాదవ్, తరుణ్, సబర్మతి నగర్ బస్తీ నాయకులు జి.నర్సింగ్ రావు, జగన్ గౌడ్, యాదగిరి, కే.నర్సింగ్ రావు,చెందు, అఫిస్, అంజాధ్, అరుంధతి నగర్ బస్తీ నాయకులు మెరుగు శ్రీనివాస్ యాదవ్, సాయిలు, జి డి.రాజు, నర్సింగ్ రావు, ఎల్లయ్య, చిప్స్ రాజు, మహిళలు పుష్ప, సరోజ, రాములమ్మ, రాజమ్మ పాల్గొన్నారు.