Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో జనవరి-2022 నూతన సంవత్సరానికి డిప్లమో, పీజీ డిప్లొమో కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ కె.రాము గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వత్తి విద్యా కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఫ్యాషన్ మీద మక్కువతో పాటు దృఢసంకల్పం ఉండాలని, వారి నిజ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమించి మహిళలు టెక్నాలజీతో పాటు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత సినీ పరిశ్రమ, టెక్స్టైల్ ఇండిస్టీతోపాటు హైదరాబాద్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాషన్ బొటిక్స్ రోజు రోజుకు ప్రాధాన్యత పెరగడం వల్ల స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువ శాతం లభిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులు చేయవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తి కలవారు 9030610055, 9030610011 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరని ఆయన కోరారు.