Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కేపీహెచ్‌బీ
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్భన్ అఫైర్స్ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కూకట్పల్లి జోన్ ఎంటమాలజీలో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులకు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయడంతో పాటు దొమల ద్వారా వ్యాధుల నివారణకు భాగస్వాములైన కూకట్పల్లి జోన్ ఎంటమాలజీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కూకట్పల్లి జోన్ ఉప కమిషనర్లు, జోన్ సీనియర్ ఎంటమాలజీస్ట్ లచ్చిరెడ్డి, అసిస్టెంట్ ఎంటమాలజీస్టులు నగేష్, ఉషారాణి, అనిల్‌కుమార్, అరుణ్‌కుమార్, సూపర్వైజర్లు స్వామి, మహేందర్, నర్సింహా, నరేష్, యాదిలాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.