Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ గురువారం ఒకటో వార్డు పరిధిలోని సంజీవయ్య నగర్ కాలనీలో పర్యటించి స్థానికులను కలిసి వివిధ సమస్యల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు డ్రయినేజీ, విద్యుత్ సమస్యలను ప్రతాప్ దష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలో పెరుగుతున్న జనాభాకనుగుణంగా డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయాల్సి ఉందన్నారు. అధికారులతో చర్చించి విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కృషి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు భద్రయ్య, దయానంద్, వర ప్రసాద్, శ్రీనివాస్, సుభాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.