Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ- కేపీహెచ్బీ
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ముల్లకత్వ చెరువు వద్ద మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణం కోసం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీర్ దిశా నిర్దేశంలో నగరంలోని మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పని చేసే గొప్ప నాయకులు సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్లన్నారు. రాబోయే రోజుల్లో కూకట్పల్లి నియోజకవర్గంలో మిగిలిన చెరువల వద్ద ఎస్టీపి ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి చెరువులను సుందరీకరణ చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శీరిష బాబురావు, డీసీ రవికుమార్, డీఈ శ్రీదేవి, ఎమ్మార్వో గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.