Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని డాక్టర్ రావూస్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటి ఇంటర్నేషనల్ ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు. ఒమిక్రాన్, మూడవ వేవ్ వ్యాప్తి చెందుతుండడంతో గురువారం కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 1 నుంచి జేఎన్టీయూ జంక్షన్, టెేంపుల్ బస్టాప్ వరకు సుమారు 50 వేల మాస్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 1లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రెండు మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.