Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్లోని నాలా పరీవాహక ప్రాంతాలైన జనార్దన్ వాడ, దత్తనగర్ బస్తీ, ఆదర్శనగర్ బస్తీలలో గురువారం డివిజన్ కార్పొరేటర్, బీజేపీ నేతలు పర్యటించి, నాలా ప్రహారీ గోడను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాలాల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా నాలాల పక్కన ఉన్న బస్తీవాసుల ఇండ్లను కూల్చివేస్తామనడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గతంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హయాంలో జనార్దన్ వాడ నుంచి దత్తనగర్ బస్తీ వరకు నాలా ప్రహారీ గోడ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. మిగతా పెండింగ్‌లో ఉన్న నాలా ప్రహారీ గోడ నిర్మాణాన్ని అశోక్ నగర్ వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. దీంతో వర్షాలకు బస్తీలన్ని నీట మునుగుతున్నాయని పలుమార్లు జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, జోనల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని అయినా ఈ సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కె.నర్సింగ్ ముదిరాజ్, నర్సింగ్ గౌడ్, నాయకులు పందిర్ల ప్రసాద్, జైస్వాల్, మల్లేష్, మహేష్, శ్రీహరి, రంజిత్, శివకుమార్, శారద తదితరులు పాల్గొన్నారు.