Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేర్ ఆస్పత్రి పలు చికిత్సకు నిలయంగా మారుతోంది. దేశంలో మొట్టమొదటిసారిగా వాస్కులర్ బయాప్సీ శస్త్ర చికిత్సతో పాటు వివిధ విలువైన 'మాష్నరీలను' విజయవంతంగా పూర్తిచేశారు. ఈఏడాదిలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో వివిధ రకాల క్లిష్ట శస్త్ర చికిత్సలను వైద్యుల బందం నిర్వహించింది. హద్రోగ నిపుణులు డాక్టర్ రాహుల్ మెదక్కర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న 65 ఏండ్ల వ్యక్తికి బీటింగ్ హార్ట్ బీమా (ద్వైపాక్షిక అంతర్గత క్షీరద ధమని)ని ప్రక్రియ ద్వారా రెండవ బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నివసిస్తున్న (63) ఏండ్ల రసిక్లాల్ శాంతిలాల్ కొఠారి ఆరేండ్ల క్రితం కాళ్లలోని సిరలను ఉపయోగించి మొదటి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కొన్నేళ్లుగా బాగానే ఉన్న అతను తర్వాత తీవ్రమైన ఛాతీ నొప్పిని అనుభవించారు. దీంతో చికిత్స కోసం కేర్ ఆస్పత్రి హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ను సంప్రదించారు. కాలిపై ఎలాంటి కోత లేకుండా మూసుకుపోయిన గుండె రక్తనాళాలకు ఆపరేషన్ చేశారు.