Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
వంగపల్లి శ్రీనివాస్ మాదిగ
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ సాధనలో ముందుండి పోరాడిన మాదిగ విద్యార్థులు మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగ విద్యార్థుల అభివద్ధే లక్ష్యంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్ అధ్యక్షతన మాదిగ విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ రాష్ట స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం హోటల్ సుప్రభాత్లో జరిగింది. స్వరాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన మాదిగ విద్యార్థుల పాత్ర మరువరానిది అని అన్నారు. అణిచివేతలు, అంటరానితనం నుంచి తమకు విముక్తి కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల 4 అక్షరాలు నేర్చుకొని విద్య వైపు అడుగులు వేస్తుంటే.. మళ్లీ తమను బానిసత్వం లోకి నెట్టడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అజెండానే దళిత, బహుజన, సబ్బండ కులాల వ్యతిరేక అజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా ఉన్నత విద్యవైపు వెళ్లకుండా అడ్డుపడుతుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని ఆవేదన వ్యక్తం చేశారు. సమవేశంలో రాష్ట్ర కార్యదర్శులు చందు, తిరుపతి రాజేష్, నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపక నరేందర్, ఓయూ అధ్యక్షులు తిరుమలేశు, విద్యార్థి నాయకులు ఎల్.నాగరాజు, జీవన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.