Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం చింతల్ డివిజన్ ఎన్ఎల్బీ నగర్ ప్రధాన రోడ్డులో ఓం శ్రీ మహిళా శక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి ప్రొడక్ట్స్ యూనిట్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. యూనిట్‌ను ఏర్పాటు చేసి పూజ సామగ్రి, పిండి వంటలు పలు రకాల వస్తువులను తయారు చేస్తూ విక్రయించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం గాజులరామారం సర్కిల్ కార్యాలయంలో రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గాజులరామారం సర్కిల్ డీసీ ప్రశాంతి, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, బి.విజరుశేఖర్గౌడ్, రశీదాబేగం, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, రుద్ర అశోక్, డీపీఓ హరిప్రియ, విజయలక్ష్మి, సుజాత, అర్చన, స్వప్న, జ్యోతి, జయశ్రీ, రజిత, ఇందిరాగౌడ్, చెన్నమ్మ, అరుణ, రాణి, ఉదయశ్రీ, శ్రీలత, వరలక్ష్మి, శాంతి, స్థానిక నాయకులు శేఖర్‌రావు, బస్వరాజు, ప్రభాకర్‌గుప్త, చలమారెడ్డి, బాల్‌రెడ్డి, మోహరున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.