Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. గురువారం కూకట్‌పల్లిలో ఏర్పాటుపచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ తెలంగాణవ్యాప్తంగా తొలివిడత 100శాతం వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తి అయినట్లు ప్రకటన చేస్తూ కేకులు కట్ చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఏ ప్రాతిపదికన నివేదిక విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు ఆధార్ కార్డులను ఆధారంగా చేసుకుని టీకాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత ఓటర్ లిస్ట్ ప్రకారం టీకాలు వేసిందన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంకా 25 నుండి 30శాతం మందికి మొదటి డోస్ టీకా కూడా వేయలేదని, కానీ టీకా వేసుకున్నారంటూ మెసేజ్ లు పంపారని అన్నారు. జీహెచ్ఎంసీలో 160 సెంటర్లలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని వీటిలో 10లక్షల డోస్ లు పక్కదారి పట్టాయని, ఈలెక్కన ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు రూ.160 నుండి 200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో నరహంతక పాలకులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. కరోనా టీకాల అవినీతికి సంబంధించి విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొరదాల నరేష్, విజిత్ వర్మ తదితరులు ఉన్నారు