Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి నెల 20 లీటర్ల ఉచిత నీటి పంపిణీ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. బాగ్ అంబర్‌పేట డివిజన్ మల్లికార్జునగర్‌లో గురువారం పర్యటించి ఉచిత నీటి పంపిణీకి ఆధార్ అనుసంధానంపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. డీడీ కాలనీలోని జల మండలి కార్యాలయంలో తమ ఆధార్‌ను లింక్ చేసుకోవాలని చెప్పారు. ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు చుక్క జగన్, సత్యనారాయణ మూర్తి, పద్మ,, వసంత తదితరులు పాల్గొన్నారు.